: నా పేరు ప్రస్తావించిన ప్రధానికి ధన్యవాదాలు: సచిన్ టెండూల్కర్


‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ‘విద్యార్థులు-పరీక్షలు’ గురించి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సచిన్ స్పందించారు. తన పేరును పేర్కొన్న భారత ప్రధానికి ధన్యవాదాలు అని, ‘సన్నద్ధత’ అనేది విద్యార్థితో పాటు ఆటగాడికి కూడా ముఖ్యమైనదని, దృష్టి పెడితే కనుక కష్టమైన పనులు కూడా సులభం అవుతాయని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సచిన్ పేర్కొన్నారు. కాగా, ఇతరులతో పోటీ పడటం కంటే మీతో మీరే పోటీ పడటం మంచిదని తన ప్రసంగంలో పేర్కొన్న మోదీ, సచిన్ తన రికార్డులతో తానే పోటీ పడుతూ, కొత్త ఘనతలు సాధించేవారని ‘మన్ కీ బాత్’ లో ఆయన ప్రస్తావించడం జరిగింది.

  • Loading...

More Telugu News