: ‘లిఫ్ట్’ కూలి మహిళా కూలీ దుర్మరణం!
లిఫ్ట్ కూలిన సంఘటనలో ఒక మహిళా కూలీ దుర్మరణం చెందింది. హైదరాబాద్ లోని బండ్లగూడలో ఉన్న ఇంద్ర ప్రస్థ కాలనీలో అపార్టుమెంట్ నిర్మాణపు పనుల్లో పద్మ అనే మహిళ నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ కూలి ఆమెపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనలో మరో మహిళ సాలమ్మకు గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అపార్టుమెంట్ యజమాని, బిల్డర్ పరారీలో ఉన్నారని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు.