: సంజయ్ లీలా బన్సాలీపై దాడిని సమర్థించిన సింగర్ అభిజిత్


జైపూర్ లో 'పద్మావతి' చిత్రం షూటింగ్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై జరిగిన దాడిని ముక్తకంఠంతో బాలీవుడ్ జనాలు ఖండిస్తున్న వేళ, సింగర్ అభిజిత్ భట్టాచార్య మాత్రం దాడిని సమర్థించాడు. హిందూ వ్యతిరేక శక్తులు బాలీవుడ్ ను ఏలుతున్నాయని, హిందువులను అగౌరవ పరచాలని చూస్తే దాడులు తప్పవని తన ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించాడు. పరిశ్రమలో స్వలింగ సంపర్కుల ఆధిపత్యం పెరిగిందని, రాజ్ పుత్ కర్ణి సేన చర్యతో హిందువులంతా గర్విస్తున్నారని అన్నాడు. కాగా, అభిజిత్ గతంలోనూ పలువురిపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News