: నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో బయటపడ్డ విభేదాలు
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా నూతన కన్వీనర్ గా మేరగ మురళీధర్ బాధ్యతల స్వీకరణ అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ నేత కొమ్మి లక్ష్మయ్య నాయుడు నాయకత్వంలో అభివృద్ధి జరగడం లేదని పలువురు నేతలు కన్వీనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన కొమ్మి వర్గీయులు ఆందోళనకు దిగారు. అటు కన్వీనర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏడు నియెజకవర్గ నేతలు డుమ్మా కొట్టారు. ఇంకోవైపు పార్టీ కార్యాలయానికి మాజీ కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తాళం వేశారు. ఈ పరిణామంతో కార్యాలయం బయటే కొత్త కన్వీనర్ మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.