: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్: మంత్రి పీతల సుజాత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారని రాష్ట్ర మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పనిగా మారిందని అన్నారు. పోలవరం విషయంలో కాంగ్రెస్ పార్టీయే రైతులకు అన్యాయం చేసిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు.