: ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్న చైతూ, సమంతల నిశ్చితార్థ వీడియో


సినీ తారలు అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల నిశ్చితార్థం నిన్న హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఎన్‌.క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అంతేగాక‌, చైతూ, సమంతల ఈ ఫొటోలను చూస్తోన్న సినీ ప్ర‌ముఖులు, అభిమానుల నుంచి ఈ జంట‌కు ట్విట్టర్‌లో, సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సంతోషంలో మునిగిన సమంత, చైతూల ఫొటోలు వారిని అల‌రిస్తున్నాయి.  టాలీవుడ్ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు వీరి వీడియో, ఫొటోల‌ను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News