: మరోసారి విఫలమైన కోహ్లీ...!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. తొలి టీ20లో పేలవ ప్రదర్శనతో రాణించలేకపోయిన కోహ్లీని మరోసారి జోర్డాన్ పెవిలియన్ కు పంపాడు. నాగ్‌ పూర్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. చావోరేవో తేలాల్సిన మ్యాచ్ లో రాహుల్ కు జతగా కోహ్లీ (21) ఓపెనర్ గా దిగాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో కోహ్లీ దూకుడు పెంచగా, తొలి మ్యాచ్ తరహాలోనే అవుట్ చేసేందుకు ప్రత్నించి ఇంగ్లండ్ ఆటగాళ్లు విఫలమయ్యాడు. భారీ షాట్ ఆడే క్రమంలో జోర్డన్ వేసిన బంతిని అంచనా వేయడంలో బోల్తా కొట్టిన కోహ్లీ డౌసన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రాహుల్ (16) కు రైనా (2) జతకలిశాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News