: రాముడికి బీజేపీ 21 సంవత్సరాల వనవాసం ఇచ్చింది: కాంగ్రెస్ నేత
అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరాన్ని 'రాజ్యాంగానికి లోబడి' నిర్మిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. దీనిపై కాంగ్రెస్ నేత టామ్ వడక్కన్ మాట్లాడుతూ, శ్రీరాముడికి బీజేపీ 21 ఏళ్ల వనవాసాన్ని ప్రసాదించిందని అన్నారు. 1996 నుంచి అయోధ్యలో శ్రీరాముడి గుడికట్టిస్తామని చెబుతూనే ఉందని గుర్తుచేశారు. 21 ఏళ్లుగా ఆ పార్టీ యూపీ మేనిఫెస్టోలో రామమందిరం కడతామని చెబుతూనే ఉందని ఆయన తెలిపారు. దీంతో రాముడికి కూడా బీజేపీపై నమ్మకం సన్నగిల్లిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. దీని ద్వారా బీజేపీ కేవలం ప్రజలకు మాత్రమే కాకుండా దేవుడికి కూడా హామీ ఇస్తోందని ఆయన విమర్శించారు. ఇన్నేళ్లు ఎవరు ఎదురు చూస్తారని ఆయన ప్రశ్నించారు.