: భన్సాలీపై దాడికి వినూత్న నిరసన తెలుపుతూ.. ఇంటిపేరు విసర్జించిన సుశాంత్ సింగ్ 'రాజ్ పుత్'!


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై జరిగిన దాడికి నటులంతా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే, బాలీవుడ్ నటులందరికీ భిన్నంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిరసన తెలిపాడు. జైపూర్ లో షూటింగ్ స్పాట్ కు వెళ్లి దాడికి దిగిన రాజ్ పుత్ కర్ణి సేనపై మండిపడ్డాడు. దీనికి నిరసనగా తన ఇంటి పేరు రాజ్ పుత్ ను తొలగిస్తున్నానని అన్నాడు. ఇంటిపేరుపై మమకారం పెంచుకున్నంత కాలం ఇలా బాధపడక తప్పదని అన్నాడు. 'ధైర్యముంటే పద్మావతికి మద్దతుగా మీ ఇంటిపేరును మాకిచ్చేయండి' అంటూ ట్వీట్ చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ట్విట్టర్ పేజ్ లో ఇప్పుడు కేవలం సుశాంత్ అని మాత్రమే ఉండడం విశేషం.


  • Loading...

More Telugu News