: జైపూర్ - ఆగ్రా హైవేపై భారీ ప్రమాదం... ఢీకొన్న 30 వాహనాలు
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు భారీ వాహన ప్రమాదానికి కారణమైంది. ఈ ఉదయం జైపూర్ - ఆగ్రా హైవేపై 30 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. జైపూర్ కు 25 కిలోమీటర్ల దూరంలోని కనోటా వద్ద ఈ ఘటన జరిగింది. పొగ మంచు కారణంగా ముందున్న వాహనాలు కనిపించక పోగా, నిదానంగా వస్తూనే ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకున్నాయి. తొలుత రెండు వాహనాలు రహదారిపై నిలిచిపోగా, ఆ వెనుక వస్తున్న వాహనాలన్నీ ఒకదాన్ని ఒకటి ఢీకొనడం గమనార్హం. పలు బస్సులు, ప్రైవేటు కార్లు, ట్రక్కులు ఢీకొన్న వాహనాల్లో ఉన్నాయి. ఈ ఘటనతో రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.