: కలసి సాగుతున్న రాహుల్, అఖిలేష్... నేడు ఒకే వేదికపైకి


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేడు యూపీలో భారీ ర్యాలీ, ఆపై బహిరంగ సభలో కలసి పాల్గొననున్నారు. ఒకే వేదికపై నుంచి ఇరువురు నేతలూ ప్రసంగించనున్నారని, ఆపై మీడియా సమావేశంలోనూ మాట్లాడతారని సమాజ్ వాదీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియాతో మాట్లాడిన తరువాత, రెండు గంటల నుంచి రోడో షో ఉంటుందని, సాయంత్రం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని తెలిపాయి. కాగా, యూపీలో 105 సీట్లకు కాంగ్రెస్, 298 సీట్లకు సమాజ్ వాదీ పార్టీలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. తమ ప్రత్యర్థులైన బీజేపీ, బీఎస్పీలను ఓడించాలంటే కాంగ్రెస్ తో పోత్తు కలిసొస్తుందని అఖిలేష్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News