: ప్రత్యేక హోదా కావాల్సిందే: హీరో నిఖిల్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని సినీ నటుడు నిఖిల్ వ్యాఖ్యానించాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఐఆర్ఎం విద్యాసంస్థల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నిఖిల్ మీడియాతో మాట్లాడాడు. రాష్ట్రానికి హోదా కావాల్సిందేనని అన్నాడు. రిపబ్లిక్ డే నాడు విశాఖలో ర్యాలీకి అనుమతిచ్చి ఉంటే బాగుండేదని, ర్యాలీ జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. తాను ప్రస్తుతం 'కేశవ' అనే చిత్రంలో నటిస్తున్నానని, నాగార్జునతో మల్టీస్టారర్ పై చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News