: పవన్ కల్యాణ్ అనుమానాలేంటి? చెబితే తీరుస్తానన్న పురందేశ్వరి


ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పవన్ కు ఉన్న అనుమానాలు ఏంటో తమకు తెలియజేయాలని ఆమె కోరారు. ఏపీ అభివృద్ధికి సహకరించేలా నిధులు ఇచ్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సిద్ధంగా ఉందని, ఇప్పటికే ఎన్నో నిధులను ఇచ్చామని, విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. హోదా ఇవ్వలేక అందుకు సమానమైన ప్యాకేజీని కేంద్రం అందిస్తోందని గుర్తు చేస్తూ, పవన్ వంటి వ్యక్తులు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడరాదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిని సారించి సలహాలు, సూచనలు ఇవ్వాలని పురందేశ్వరి కోరారు.

  • Loading...

More Telugu News