: పశ్చిమబెంగాల్ లో పోలీస్ స్టేషన్‌పై మూడువేల మంది రాళ్ల దాడి.. పోలీసులను చితకబాది విధ్వంసం
పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్ ఆస్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌పై మూడువేల మంది మూకుమ్మడిగా దాడిచేశారు. పాఠశాల ఆవరణలో అక్రమ నిర్మాణం విషయంలో రాజుకున్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. రాళ్లు, ఇటుకలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న స్థానికులు విధ్వంసం సృష్టించారు. దొరికిన పోలీసులను దొరికినట్టు చితకబాదారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. వారి దాడిలో 8 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రజల దాడి నుంచి బతికిబయటపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ పాటిల్ దాడి విషయాన్ని మీడియాకు, అధికారులకు తెలిపారు. దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఆయన అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.