: విదేశాల్లో 202 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన దంగల్


హాలీవుడ్ సినిమాలు భారత్ లో విడుదలై వందల కోట్ల వసూళ్లు సాధించడం సర్వసాధారణంగా మారింది. అదే సమయంలో భారతీయ సినిమాలు విదేశాల్లో వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి తరుణంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా విదేశాల్లో ఊహించని వసూళ్లు సాధించి రికార్డులు సొంతం చేసుకుంది. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలను ఛాంపియన్లుగా మలచే క్రమాన్ని ఆసక్తికరంగా మలచిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంది.

 దీంతో ఇది విడుదలైన ఆరోవారం వరకు మంచి కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో దంగల్ సినిమా ఈ నెల 27 నాటికి ఓవర్సీస్‌ లో 29.69 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో 202.21 కోట్ల) వసూళ్లు సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. భారత్‌ లో ఈ సినిమా ఇప్పటి వరకు 384.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో మొత్తం 586.36 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దంగల్... ఇదే వసూళ్ల జోరు చూపిస్తే... ఈ సినిమా భారత్ లో 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలిసినిమాగా రికార్డు పుటలకెక్కనుంది. 

  • Loading...

More Telugu News