: నోట్ల రద్దుతో నల్లధనం ఎలా వెలికి తెస్తారో చెప్పాలి: అరుణ్ శౌరి


పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని ఎలా వెలికితీస్తారో చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి ప్రశ్నించారు. హైదరాబాదులో నిర్వహించిన లిటరరీ ఫెస్టివల్ లో ఆయన మాట్లాడుతూ, నల్లధనం దాచిన వారెవరైనా దానిని నోట్ల రూపంలో మార్చి తమ వద్ద ఉంచుకుంటారా? అని ప్రశ్నించారు. నల్లకుబేరులు సంపాదించిన ధనాన్ని విదేశాల్లో దాచుకుంటారని చెప్పారు. అలా దాచుకున్న దానితో కంపెనీలు, ఎస్టేట్లు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారని ఆయన తెలిపారు. డెంగ్యూ దోమ స్విట్జర్లాండ్ లో తిరుగుతుంటే దానిని భారత్ లో వెతికితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దుతో నల్లధనం ఎలా వెలికి వస్తుందని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు మంచిదా? కాదా? దానితో నల్లధనం వెలికి వస్తుందా? రాదా? అన్నది రాజకీయ నాయకులతోపాటు ప్రజలకు కూడా తెలియదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News