: సంజయ్ లీలా భన్సాలీకి ఎంత ధైర్యం?: రాజ్ పుత్ కర్ణి సేన వ్యవస్థాపకుడి సంచలన వ్యాఖ్యలు


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై జరిగిన భౌతిక దాడిని సినీ పరిశ్రమలన్నీ ఖండిస్తున్నాయి. ఈ విధానం సరైనది కాదని హితవు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ పుత్ కర్ణిసేన వ్యవస్థాపక అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వి స్పందించారు. సంజయ్ లీలా భన్సాలీపై దాడి సరైనదేనని సమర్ధించారు. సంజయ్ లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తాడని ఆయన ఆరోపించారు. గతంలో జోధా అక్బర్ సినిమాలో కూడా జోధాభాయ్ కథను వక్రీకరించాడని మండిపడ్డారు. అతనికి బుద్ధి చెప్పాలనే అతనిపై దాడి చేశామని తెలిపారు. జర్మనీ వెళ్లి హిట్లర్ పై ఎవరైనా సినిమా తీయగలరా? అని ఆయన నిలదీశారు. సంజయ్ లీలా భన్సాలీకి ఎంత ధైర్యముంటే తమ ప్రాంతానికే వచ్చి రాణి పద్మావతి దేవి చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడని ఆయన మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News