: షీనా బోరా హత్య కేసులో తండ్రికి మద్దతు పలుకుతున్న రాహుల్ ముఖర్జియా


దేశవ్యాప్తంగా కలకలం రేపిన షీనా బోరా హత్య కేసులో నిందితుడు పీటర్ ముఖర్జియా నిర్దోషని, అతని కుమారుడు, హతురాలి ప్రియుడు రాహుల్ ముఖర్జియా చెప్పాడు. 2015లో పెనుకలకలం రేపిన ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా, తన రెండో భర్త, డ్రైవర్ సాయంతో కన్న కూతురు షీనా గొంతు నులిమి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేసిన సీబీఐ ఇంద్రాణి, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, మూడో భర్త పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపించింది. ఈ మేరకు వారిపై ఛార్జిషీట్ కూడా ప్రత్యేకకోర్టులో దాఖలు చేసింది. దీనిపై ఫిబ్రవరి 1 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన రాహుల్ ముఖర్జియా, షీనా హత్య కేసులో తన తండ్రి పీటర్ ముఖర్జియాకు సంబంధం లేదని ప్రకటించాడు. షీనాతో తన అనుబంధం ఇష్టం లేని ఆమె తల్లే షీనాను హత్య చేసిందని, తన తండ్రికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని ఆయన వాదిస్తుండడంతో ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News