: మమ్మల్ని బయటి వ్యక్తుల్లానే చూస్తున్నారు.. అదే బాధ!: నటి రిచా చద్దా
సినీ పరిశ్రమలో స్టార్ కిడ్స్ ను ప్రత్యేకంగా చూడటం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి, స్టార్ కిడ్స్ కు ట్రీట్ మెంట్లో కొంచెం తేడా ఉంటుంది. ఇలా నటులను వేర్వేరుగా చూడటం తనకు చాలా అసహ్యంగా ఉంటుందని బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా తెలిపింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చిన వాళ్లు అంటే తమ లాంటి వాళ్లేమీ ఇతర గ్రహాల నుంచి రాలేదని చెప్పింది. తనను ఇప్పటికీ బయటి వ్యక్తిగానే చూస్తున్నారని వాపోయింది. తనకు ఔట్ సైడర్ అనే పదమే సరిపోదని చెప్పింది. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వారిలాగానే బయట నుంచి వచ్చిన వారు కూడా సక్సెస్ అవుతారనే విషయాన్ని ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలని రిచా చెప్పింది. కష్టపడే వారికి విజయం తప్పకుండా దక్కుతుందని తెలిపింది.