: నల్గొండ జిల్లాలో దారుణం.. ఆరు రోజుల ఆడశిశువుని చంపేసిన తల్లిదండ్రులు


కొడుకుల క‌న్నా కూతుర్లే న‌యం అని తెలియ‌జెబుతూ ఎన్నో సంఘ‌ట‌న‌లు వెలుగులోకొస్తున్నా కొందరు త‌ల్లిదండ్రులు మాత్రం ఆడ‌పిల్ల అంటేనే గుండెల మీద కుంప‌టిలా భావిస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో ఓ దంప‌తులు దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. తమ ఆరు రోజుల పసికందుని చంపేశారు. అనంత‌రం ఆ ప‌సిపాప‌ను దహనం చేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు వెంట‌నే స్థానిక‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స‌ద‌రు క‌సాయి త‌ల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News