: హైదరాబాద్ లో ఈ రోజు 14 బాంబులు పేలుతాయని ప్రచారం.. వదంతులని కొట్టిపారేసిన పోలీసులు!


హైదరాబాద్ న‌గ‌రంలోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా టెంపుల్‌, కూకట్‌పల్లి షాపింగ్‌ కాంప్లెక్స్‌, మెహిదీపట్నం, చార్మినార్‌, లక్డీకాపూల్‌, ధూల్‌పేట, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌, ఎంజీబీఎస్, హైటెక్‌సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు ఈ రోజు 14 బాంబులని పేల్చుతార‌ని నిన్న వాట్స‌ప్‌తో పాటు ప‌లు సోష‌ల్ మీడియా వెబ్‌సైట్‌ల‌లో ఓ ఫేక్ న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేసింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో హై అల‌ర్ట్ ఉంద‌ని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టుల‌పై హైదరాబాద్ సీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య‌, రాచకొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స్పందించి అవ‌న్నీ వ‌దంతులేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు ఇటువంటి పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు. నగ‌రంలో బాంబు పేలుళ్ల‌కు ఉగ్ర‌వాదులు కుట్ర ప‌న్న‌లేద‌ని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News