: రెండు, మూడు నెలల్లో జగన్ సెంట్రల్ జైలుకు వెళతాడు: ఎమ్మెల్యే యరపతినేని
వైసీపీ అధినేత జగన్ కు ఎంతసేపూ ముఖ్యమంత్రి అవుదామనే ఆలోచన తప్ప... రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదని గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆయన సీఎం అవడం ఏమోకాని... రానున్న రెండు, మూడు నెలల్లో సెంట్రల్ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని చెప్పారు. విశాఖలో తన తల్లి విజయమ్మ ఓడిపోవడాన్ని జగన్ ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వస్తుంటే... జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు జరగకుండా, భయభ్రాంతులకు గురిచేసే కుట్ర పన్నారని అన్నారు.