: ప్రపంచ ప్రఖ్యాత నటుడు జాన్ హర్ట్ కన్నుమూత!
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బ్రిటీష్ నటుడు సర్ జాన్ హర్ట్ (77) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. అనేక సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి జాన్ హర్ట్... సినీ ప్రేమికులను అలరించారు. ఆయన సేవలను గుర్తించిన బ్రిటీష్ రాణి ఆయనకు 2015లో 'సర్' సత్కారాన్ని అందించారు. రెండు సార్లు ఆయన ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఏలియన్, ఎలిఫెంట్ మ్యాన్, హెర్క్యులస్, ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్ తదితర సినిమాలలో ఆయన నటించారు. ఆయన మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, పలువురు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు.