: జనసేనా? ఆ పార్టీ ఎవరిది?: సినీ నటి జయసుధ
సినిమాల్లో బిజీగా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న జయసుధ 'జనసేన ఎవరి పార్టీ?' అని ప్రశ్నించడంతో బిత్తరపోవడం మీడియా ప్రతినిధి వంతైన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. టీడీపీలో కొనసాగుతున్న మీరు భవిష్యత్ లో ‘జనసేన’ లో చేరే అవకాశం ఉందా? అంటూ మీడియా ప్రతినిధి జయసుధను ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానమిస్తూ, 'జనసేనా? ఆ పార్టీ ఎవరిది?' అని ప్రశ్నించారు.
దీంతో 'అది పవన్ కల్యాణ్ పార్టీ' అని చెప్పగానే.. 'అవునా? పవన్ పార్టీ పేరు ‘జనసేన’ అని నాకు తెలియదు' అని చెప్పారు. పవన్ కల్యాణ్ పార్టీ అంటే గుర్తుకొస్తుంది తప్ప ఆ పార్టీ పేరు తనకు తెలియదని ఆమె అన్నారు. అనంతరం రాజకీయాల్లో తాను అందర్నీ సపోర్ట్ చేస్తానని చెప్పారు. అయితే రాజకీయాల్లో కష్టపడి పని చేసినవారే గెలుస్తారని ఆమె తెలిపారు. 2009 ఎన్నికలకు ముందు అందరూ తనను చిరంజీవి పార్టీలో చేరుతారా? అంటూ ప్రశ్నించేవారని, కొన్ని నెలల తరువాత ఆయనే తమ పార్టీ (కాంగ్రెస్) లో చేరారని ఆమె అన్నారు. ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదని ఆమె చెప్పారు.