: అక్షయ్ కుమార్ ది అద్భుతమైన ఆలోచన: హర్భజన్ సింగ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ది అద్భుతమైన ఆలోచన అని ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ కితాబునిచ్చాడు. దేశం కోసం నిరంతరం శ్రమించే సైనికుల సంక్షేమం కోసం ఓ యాప్ రూపొందిస్తానని, దాని ద్వారా ఎవరైనా అమరజవాన్ల కుటుంబాలకు సహాయం చేయవచ్చని అక్షయ్ పేర్కొనడం ఆనందదాయకమని భజ్జీ తెలిపాడు. ఈ ఆలోచన తనకు ఎంతగానో నచ్చిందని, దీనికి తాను అండగా ఉంటానని అన్నాడు. మన సోదరుల కోసం మనం దీనిని ప్రారంభిద్దామంటూ జైహింద్ చెప్పాడు.
కాగా, అమర వీరులను ఆదుకోవడంలో ముందుండే అక్షయ్ కుమార్, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఓ యాప్ రూపొందిస్తానని, దాని ద్వారా అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవచ్చని, ఈ రకంగా సేవ చేయడం కూడా దేశభక్తేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.