: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన సీఐఐ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ... ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. దేశ ప్రజలంతా సంస్కరణలు కోరుకుంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జీఎస్‌టీ సవరణ బిల్లు వల్ల దేశంలో పన్నులు ఒకే విధంగా ఉంటాయని చెప్పారు.