: సుజనా, రాయపాటిలను శిక్షించండి... మద్దతివ్వద్దు: చంద్రబాబుకు పవన్ సూచన


"సుజనా చౌదరి గారు మాట్లాడతారు... జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుని కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోవాలని చెప్పి... ఇదేనాండీ మీరు మాట్లాడే మాటలు? ఇన్ని కోట్ల మంది మనోభావాలను మీరు కించపరుస్తున్నట్టు కాదా? మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకుని మీరు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు? మీకెవరు స్ఫూర్తి? ఆ మాట నేను మాట్లాడితే, మీకెలా ఉంటది? నాకు ఎంతోమంది సుజనా చౌదరి ఫైల్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. నాకు అర్థం కాలేదు, దానిలో నిజానిజాలు ఎంతున్నాయన్నది. నేను చెప్పాను... నాకు ఇచ్చినవారికి...  నాకు ఆయన తెలుసు. మాట్లాడేందుకు ఇబ్బంది లేదు. కానీ నిజం తెలుసుకోకుండా మాట్లాడవద్దని అనుకున్నాను. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎందుకు వెనక్కివ్వలేదని ఇప్పుడు అడుగుతున్నా? మీ వెనకాల ఇన్ని లోపాలు, సమస్యలు పెట్టుకుని ప్రజలను అనే హక్కు మీకు ఎక్కడుంది? చేతనైతే మీరు ప్రజలకు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయండి. అంతేకానీ చేసే వారిని కించపరచకండి" అని హితవు పలికారు.

చంద్రబాబు పరిపాలనా అనుభవం... బంగారు ఆంధ్రప్రదేశ్ సాకారానికి ఉపయోగపడాలని తాను కోరుకుంటున్నానని పవన్ చెప్పారు. చంద్రబాబుకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పోలవరం విషయంలో అవినీతికి పాల్పడుతున్న రాయపాటి సాంబశివరావు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన సుజనా చౌదరిలను శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగపూర్ ప్రెసిడెంట్ లీ క్వాన్ యూ తనకు ఆదర్శమని చెప్పుకునే చంద్రబాబు, అదే మాటపై నిలిచి, ఎలాగైతే అవినీతి ఆరోపణలు వచ్చిన తన సొంత స్నేహితులను, సహచరులను లీ క్వాన్ ఎలా శిక్షించారో అదే పద్ధతి అమలు చేయాలని సూచించారు. వారిపై ఎక్స్ పర్ట్ కమిటీని వేయాలని, అంబుడ్స్ మన్ ను నియమించాలని, అనుభవమున్న పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని అడిగారు. సుజనా చౌదరి వంటి వారు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News