: వెంకయ్యనాయుడు గారూ... మీ ఇష్టానికి మీరు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చుంటామా?: పవన్ కల్యాణ్


ఎన్నికలకు ముందో మాట, తరువాత ఓ మాట చెప్పే రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి పోయిందని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. నాడు పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని నినదించిన వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను పవన్ గుర్తు చేశారు. అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతూ, మీ ఇష్టానికి మీరు చేసుకుంటూ పోతుంటే, ప్రజలు చేతులు కట్టుకుని కూర్చుంటారా? అని ప్రశ్నించారు. అలా ఎన్నటికి జరగబోదని హెచ్చరించారు.

"ఏమనుకుంటున్నారండీ మీరు... మీరు స్వర్ణభారత్ ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పెట్టివుంటే, ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చుండేది. స్వర్ణ భారత్ ట్రస్ట్ పై పెట్టినంత మనసు ప్రజా సమస్యల పరిష్కారంపై పెట్టలేదు. మీరు మూడు సంవత్సరాల్లో ఇన్ని రకాలుగా మాటలు మార్చారు. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు. ఏదైనా చేయించుకోండి. కానీ నమ్మకాన్ని నిలుపుకోండి" అని హితవు పలికారు.

  • Loading...

More Telugu News