: మోడీపై అమెరికాకు అంతకోపం ఎందుకో..!?


వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రాచుర్యంలో ఉన్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై అమెరికా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తాజాగా మోడీకి వీసాపై నిషేధం కొనసాగించాలంటూ అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంఘం సూచించింది. గుజరాత్ అల్లర్ల సందర్భంగా మోడీ మత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా తీవ్ర చర్యలకు పాల్పడ్డారని, అందుకే ఆయన అమెరికాలో ప్రవేశించదగ్గ వ్యక్తి కాదని అమెరికా మత స్వేచ్ఛ సంఘం తన వార్షిక నివేదికలో పేర్కొంది.

గుజరాత్ మత అల్లర్లకు సంబంధించి మోడీ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని, ఆయనకు వీసా కేటాయించడం సరికాదని మత స్వేచ్ఛ సంఘం చైర్ పర్సన్ కత్రినా లాంటోస్ స్వెట్ అన్నారు. గత మార్చిలో ముగ్గురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు గుజరాత్ లో పర్యటించి మోడీకి క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేగాకుండా, ఆయనకు అమెరికా వీసా ఇవ్వొచ్చంటూ సిఫారసు చేశారు కూడా. ఈ నేపథ్యంలో అమెరికా మత స్వేచ్ఛ సంఘం తాజా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడం మోడీపై వారి ఆగ్రహాన్ని తెలియజేస్తోంది.

  • Loading...

More Telugu News