: సినీ నటుడు మంచు విష్ణుపై మరో కేసు నమోదు
ఇండియాను రెండు ముక్కలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు మంచు విష్ణుపై హైదరాబాద్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. విష్ణుపై దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నరేంద్ర మోదీ విచార్ మంచ్ ఫిర్యాదు చేసింది. ఆయన బాధ్యతారాహిత్యంతో మాట్లాడారని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని సంఘం నాయకులు ఆరోపించారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, దేశంలో ప్రభుత్వాలు దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఏర్పాటవుతున్నాయని, అయినా, ఇక్కడి ప్రజలకు సరైన గుర్తింపు రావడంలేదని, అలాంటప్పుడు కలసి వుంటే లాభం లేదని, ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు దేశాలుగా విభజించాలని విష్ణు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.