: ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో నగదు ఉపసంహరణపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత!
ఆర్బీఐ నుంచి ప్రజలకు మరో తీపి కబురు అందనుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేందుకు ఆర్బీఐ యోచిస్తోంది. మొదట్లో రూ.2 వేలకు మాత్రమే పరిమితమైన విత్ డ్రాయల్స్‌ను తర్వాత రూ.2,500కు, ప్రస్తుతం రూ.10వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నగదు చలామణి పెరిగి క్రమంగా సాధారణ పరిస్థితులకు చేరుకుంటుండడంతో ఫిబ్రవరి చివరి నాటికి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆర్బీఐ భావిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా తెలిపారు.