: ఆ భయంతోనే వైఎస్ సతీమణి విజయను విశాఖ వాసులు ఓడించారు!: చంద్రబాబు
రిపబ్లిక్ డే రోజు విశాఖపట్టణంలో జరిగిన అలజడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. జగన్ తీరును దుయ్యబట్టిన ఆయన విశాఖవాసుల గొప్పతనాన్ని కొనియాడారు. పులివెందులకు ఓ చరిత్ర ఉందని, దాన్ని ఇక్కడ ఎక్కడ పునరావృతం చేస్తారోనని విశాఖవాసులు భయపడ్డారని, ఆ భయంతోనే వైఎస్ సతీమణి విజయను ఓడించారని అన్నారు. వారు ఇక్కడ గెలిస్తే కడప రాజకీయాలకు, భూకబ్జాలు, నేరాలు, ఘోరాలకు విశాఖ నగరం వేదిక అవుతుందని భయపడ్డారని అన్నారు. అందుకనే ఆమెను ఓడించారని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జగన్ వ్యవహరించిన తీరు అవమానకరమన్నారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.