: జాతీయ పతాకం ఆవిష్కరించి తమిళనాట రికార్డు నెలకొల్పిన పన్నీర్ సెల్వం


ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమిళనాట సరికొత్త రికార్డు నమోదు చేశారు. తమిళనాడులో రిపబ్లిక్ డే రోజున పతాకావిష్కరణ చేసిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు పుటలకెక్కారు. తమిళనాడులో ఇన్నేళ్లలో ఏ ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేయలేదు. తమిళనాడుకు శాశ్వత గవర్నర్ లేకపోవడంతో పన్నీర్ సెల్వంకు ఈసారి జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మెరీనాబీచ్‌ లో పతాకావిష్కరణ చేసే అవకాశం దొరికింది. దీంతో పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూనే రికార్డు సృష్టించడం విశేషం. 

  • Loading...

More Telugu News