: కాన్పూర్ టీ20: టీమిండియా 75/3


కాన్పూర్ వేదికగా జరగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు పట్టుదలగా ఆడుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. కోహ్లీ ఓపెనర్ గా దిగగా, కేఎల్ రాహుల్ (8) మరోసారి నిరాశపరిచాడు. కోహ్లీ (29) కూడా ధాటిగా ఆడలేక అవుటయ్యాడు. బ్యాటింగ్ లో వేగం పెంచే క్రమంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన యువరాజ్ సింగ్ (12) ను రషీద్ ఒడిసిపట్టేశాడు. దీంతో భారత జట్టు 10.1 ఓవర్లలో భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో సురేష్ రైనా (27) కు ధోనీ (4) జతకలిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డన్, ప్లంకెట్, మొయిన్ అలీ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News