: జగన్ అరెస్టుకు రంగం సిద్ధం?
విశాఖపట్నంలో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వైసీపీ అధినేత జగన్ సాగర నగరానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన విశాఖలో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయం నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు. తిరిగి హైదరాబాదుకు వెళ్లిపోవాలని ఆయను సముదాయించేందుకు పోలీసు అధికారులు మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖ ఎయిర్ పోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జగన్ ను అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని తెలుస్తోంది. మరో వైపు ఎయిర్ పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. వారందరినీ ఎయిర్ పోర్టుకు కొంచెం దూరంలోనే ఆపేశారు. విమానాశ్రయంలోకి ప్రయాణికులను తప్పించి మరెవరినీ లోపలకు వదలడం లేదు.