: బీచ్ లో చలసాని శ్రీనివాస్... అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తూ యువకులు చేపట్టిన దీక్షకు మద్దతుగా బీచ్ లో ర్యాలీ చేపట్టిన ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణం చేరుకున్న రెడ్నమ్ గార్డెన్స్ మీదుగా పెద వాల్తేరు చేరుకుని, అక్కడున్న కాలనీ మీదుగా పామ్ బీచ్ వైపు ర్యాలీ ప్రారంభించారు. కొంత మంది యువకులు ఆయనను అనుసరిస్తూ ఆర్కే బీచ్ చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు పామ్ బీచ్ చేరుకునేసరికి విషయం పోలీసులకు చేరడంతో వారు రంగ ప్రవేశం చేసి పెదవాల్తేరు బీచ్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.