: ఇలాంటి అరెస్టులను ఎక్కడా చూడలేదు: ధర్మాన


తమ భవిష్యత్తు కోసం, హక్కుల కోసం పోరాడుతున్న యువతను ఇంత అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎక్కడా చూడలేదని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజల ఆంకాంక్షలను అణచివేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒక దుష్ట సంప్రదాయానికి టీడీపీ ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు. ఈ ఉద్యమాన్ని ఎంత అణచివేయాలని చూస్తే, అంత ఉద్ధృతమవుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ, ప్రజలంతా ప్రత్యేకహోదా కావాలని కోరుకుంటున్నారన్న విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు.

  • Loading...

More Telugu News