: పాకిస్థాన్, నేపాల్ దౌత్య కార్యాలయాల్లో రిపబ్లిక్ వేడుకలు!
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. ఈ రోజు భారత్ 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అక్కడి భారత దౌత్య కార్యాలయంలో అధికారులు మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. హై కమీషనర్ గౌతమ్ భంబేవాలే మన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మరోవైపు నేపాల్ రాజధాని ఖాట్మండులోని భారతీయ ఎంబసీలోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.