: హైదరాబాద్ ను తాకిన హోదా నిరసనలు... కేబీఆర్ పార్కు వద్ద టెక్కీల నిరసన
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కోరుతూ యువత చేపట్టిన నిరసన దీక్షలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను తాకాయి. ఏపీలో యువత చేస్తున్న పోరుకు మద్దతుగా, కేబీఆర్ పార్కు వద్ద పలువురు ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు. "వీ వాంట్ స్పెషల్ స్టేటస్" అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, ఇందుకోసం మోదీ సర్కారుపై ఒత్తిడి చేయాలని టెక్కీలు డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి వారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెబుతూ, హోదా ఉద్యమానికి మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.