: జగన్ కుటుంబంలో మరో అసంతృప్తి?
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో మరో అసంతృప్తి చెలరేగినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన చిన్నాన్న మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మనోహర్ రెడ్డి భార్య పులివెందుల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. ఆయన కూడా కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో, కుటుంబంలోని కొందరు మున్సిపాలిటీలో ఎక్కువగా జోక్యం చేసుకుంటుండటంతో... మనోహర్ రెడ్డి అసంతృప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, వైస్ ఛైర్మన్ వ్యవహారం కూడా కుటుంబసభ్యుల్లో విభేదాలకు కారణమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, మనోహర్ రెడ్డి తమ పదవులకు కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మనోహర్ రెడ్డిని బుజ్జగించేందుకు బంధువులు కొందరు ప్రయత్నించినప్పటికీ... ఆయన తగ్గలేదని తెలుస్తోంది. గతంలో వైయస్ మరో సోదరుడు వివేకానంద రెడ్డి జగన్ కు దూరమై కాంగ్రెస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఆయన జగన్ కు దగ్గరయ్యారు.