: నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంటిలో ఐటీ అధికారులు దాడి చేశారు. హైదరాబాదులోని బండ్ల గణేష్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని గణేష్ నిర్మించిన విషయం తెలిసిందే.