: మహేష్ బాబు తక్షణం కదలకుంటే మోసం చేసిన వాడవుతాడు!: రాంగోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఎలా పోరాటం చేస్తున్నాడో, అదే విధంగా పోరాడాలని ప్రిన్స్ మహేష్ బాబుకు అతని అభిమానులు చెప్పాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించాడు. మహేష్ బాబు తక్షణం కదలకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిన వాడే అవుతాడని విమర్శించాడు. తక్షణం పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం వెంట నడవని ఏ సెలబ్రిటీ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసే నేరస్తులేనని వ్యాఖ్యానించాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కదలాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు.