: పాత నోట్లు ఇంకా ఉన్నాయా? డిపాజిట్ కు ఆఖరి చాన్స్!


ఇంకా పలువురి వద్ద పాత రూ. 500, రూ. 1000 నోట్లు బయటపడుతున్న నేపథ్యంలో వాటిని కూడా బ్యాంకుల్లో వేసుకునేందుకు చివరి సారిగా మరో అవకాశం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఒక్కొక్కరూ గరిష్ఠంగా రూ. 2 వేల వరకూ డిపాజిట్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ భావిస్తున్నట్టు సమాచారం. పాత నోట్ల డిపాజిట్ కు డిసెంబర్ 30 తరువాత చాన్స్ లేనప్పటికీ, తమ వద్ద తెలియకుండానే కొన్ని నోట్లు మిగిలిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అతి తక్కువ కాలం మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని సమాచారం. కాగా, జూన్ వరకూ ఎన్నారైలకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News