: అమీర్ ఖాన్ తో కలసి పని చేయాలని ఉంది: 'కుంగ్ ఫూ యోగా' డైరెక్టర్ స్టాన్లీ టాంగ్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని 'కుంగ్ ఫూ యోగా' సినిమా డైరెక్టర్ స్టాన్లీ టాంగ్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇండియాలో ఉన్నాడు. అమీర్ ఖాన్ దంగల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల తన సినిమాకు కాల్షీట్లు ఇవ్వలేకపోయాడని... రాబోయే రోజుల్లో కచ్చితంగా అమీర్ తో కలసి సినిమా తీస్తానని చెప్పాడు. అమీర్, తాను మంచి స్నేహితులమని చెప్పాడు. 'కుంగ్ ఫూ యోగా' సినిమాను అమీర్ కు చూపిస్తానని తెలిపాడు. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల కానుంది.