: బెంగళూరు యూనివర్శిటీ డాక్టరేట్ ను తిరస్కరించిన రాహుల్ ద్రావిడ్!
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరు యూనివర్శిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించాడు. తనకు ఈ డాక్టరేట్ వద్దని... క్రీడా విభాగంలో పరిశోధన చేసిన తర్వాత నిజమైన డాక్టరేట్ అందుకుంటానని చెప్పాడు. బెంగళూరు యూనివర్శిటీ తన 52వ కాన్వొకేషన్ సందర్భంగా ద్రావిడ్ ను సత్కరించాలని భావించింది. బెంగళూరులోనే పుట్టి పెరిగిన రాహుల్ ద్రావిడ్... అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2012లో రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియా-ఏ, అండర్-19 జట్ల ఆటగాళ్లకు అతను కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.