: ఆయన మాటలకు నా నరాలు బిగిశాయి.. సిగ్గు, బాధ కుదిపేశాయి!: చంద్రబాబు
ఇటీవల తనను కలిసిన అమెరికాకు చెందిన ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ అన్న మాటలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మాట్లాడుతూ వెంచర్ క్యాపిటలిస్ట్ మాటలు తనను బాధించాయన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులంటే మోసానికి ప్రతీకలని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారన్నారు. ఆయన మాటలకు తన నరాలు బిగిశాయని, సిగ్గు, బాధ తనను కుదిపేశాయన్నారు. ఆయన మాటలకు ఎన్నాళ్ల క్రితం ఇటువంటి పరిస్థితి ఉండేదని ప్రశ్నించానని, దానికి ఆయన నాలుగైదేళ్ల క్రితం అని అన్నారని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లో కొన్ని తప్పులు జరిగాయన్నారు. ఏపీ పెట్టుబడిదారులపై ఇతర దేశాల వారికి అలాంటి విశ్వాసం ఉండేదని, ఇప్పుడు దానిని తుడిపేసి, విశ్వాసం కలిగించే స్థాయికి తీసుకొచ్చానని అన్నారు.