: ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త!
‘వాట్సప్’ ద్వారా మెసేజ్ లు పంపాలనుకున్న ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై ఇంటర్ నెట్ అవసరం లేకుండా తమ సందేశాలను ఐఫోన్ వినియోగదారులు పంపుకోవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఫీచర్ ను ఐఓఎస్ వెర్షన్ 4.2017.0200గా ఉన్న ఫోన్లకు అందజేస్తున్నామని, ఐ ఫోన్లను అప్ డేట్ చేసుకోవడం వలన ఈ ఆఫర్ పొందవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ ఫీచర్ ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికే ప్రవేశపెట్టారు. కొత్తగా యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు కూడా వర్తించే విధంగా తీర్చి దిద్దారు.