: తిరుమలలో అపచారం... వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద నమాజ్ చేసిన ముస్లిం!


తిరుమలలో భద్రత డొల్లతనం మరోసారి బయటపడింది. అంత్యంత పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులకు ప్రవేశం నిషిద్ధం. ఒకవేళ హిందూ మతంపై మక్కువతో ఎవరైనా వెళ్లినా, వారు హిందూ మతాన్ని, సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుంది. అలా గౌరవించకుండా గతంలో ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవర్తించగా, తాజాగా ఓ ముస్లిం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు వెళ్లి...అక్కడ నమాజ్ చేశాడు. ఆయన నమాజ్ చేసినప్పుడు ఎవరూ ఆయనకు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మక్కాకు వెళ్లి అభిషేకం చేస్తే ఇలాగే ఉంటుందా? అని హిందువులు ప్రశ్నిస్తున్నారు. ముస్లింలు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కాగా, నమాజ్ చేసిన వ్యక్తి బెంగాల్ కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News