: విజయసాయి బెయిల్ రద్దుపై విచారణ రేపటికి వాయిదా
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా వాదించిన సీబీఐ లాయర్.. జగన్ కేసులో దాఖలు చేసిన ప్రతి అభియోగ పత్రంలో విజయసాయికి ప్రమేయం ఉందన్నారు. బెయిల్ ఇస్తే నిందితులను ఆయన ప్రభావితం చేస్తారని హైకోర్టే పేర్కొందని చెప్పారు. కాబట్టి విజయసాయి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇదిలావుంటే జగన్ కేసులో ఇప్పటికే ఐదు ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, వీటికి విజయసాయి ఎలాంటి ఆటంకం కలిగించలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తునకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారానీ, కాబట్టి బెయిల్ రద్దు చేయవద్దని న్యాయవాది కోరారు.