: సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ ఎంపీ కవిత
టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న సమయంలో అందులో భాగంగా కవిత మౌలాలి రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆమెపై కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా కవిత రైల్వే కోర్టుకు హాజరయి సమాధానం చెప్పుకున్నారు.